ఫ్యూచర్ మార్కెట్లో నారింజ రసం ధరలు ఈ నెలలో 20 శాతం పెరిగాయి. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులను కొనుగోలు చేస్తుండడంతో నారింజ రసం ధరలు పెరుగుతున్నాయి.
ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా రవాణా ఆంక్షలు పెరగడంతో ఉత్పత్తి ఉన్నప్పటికీ సరఫరా తగ్గిపోయింది. ఇది ఫ్యూచర్ మార్కెట్లో నారింజ రసం ధర పెరిగింది.
‘‘కోవిడ్-19 దెబ్బకు డిమాండ్ అమాంతం పెరగ్గా సరఫరాకు అవకాశాలు తగ్గిపోయాయి. నారింజ రసంలో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉండడంతో దీనికి గిరాకీ బాగా పెరిగింది.
అదేసమయంలో దీన్ని మార్కెట్లకు చేర్చడానికి అవకాశం లేకుండాపోయింది.
విమానయాన సదుపాయాలు తగ్గిపోవడంతో..
విమానయాన సంస్థల వద్ద సరిపడా ట్యాంకర్ స్పేస్ లేకపోవడం వల్ల సరఫరా పెంచడానికి కష్టమవుతోంద’’ని యాక్సీ కార్ప్ సంస్థ చీఫ్ గ్లోబల్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ స్టీఫెన్ ఇన్స్ చెప్పారు.
మరోవైపు సోషల్ డిస్టెన్సింగ్ ఆంక్షలు కారణంగా నారింజ తోటల్లో పనిచేయడానికి కార్మికులు కూడా దొరకడం లేదు.
ఫ్లోరిడా, బ్రెజిల్‌లలోని నారింజ తోటల్లో పనికి కార్మికులు లేక వ్యాపారులు ఇదేంటీ పరిస్థితని ఆశ్చర్యపోతున్నారు’’ అని అమెరికాకు చెందిన వాణిజ్య సంస్థ ప్రైస్ ఫ్యూచర్స్ గ్రూప్‌కు చెందిన జాక్ స్కోవిల్లీ అన్నారు.