యాంకర్‌ శ్రీముఖిపై పోలీస్ కేసు

ప్రముఖ యాంకర్ శ్రీముఖిపై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు శ్రీముఖిపై కేసు నమోదు చేశారు. నల్లకుంటకు చెందిన వెంకటరమణ శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా కామెడీ షోలో దృశ్యాలను చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జెమినీ టీవీలో ప్రసారమైన ‘జూలకటక’ కామెడీ షోలో బ్రాహ్మణులను కించపరిచినట్టు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బంజారాహిల్స్ పోలీసులను శర్మ ఆశ్రయించారు.


శర్మ ఫిర్యాదు మేరకు శ్రీముఖితో పాటు, జెమిని టీవీ యాజమాన్యంపై పోలీసులుకు కేసు నమోదు చేశారు. నిజానికి ‘జూలకటక’ అనేది పాత కామెడీ షోనే. రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. అయితే, ఈ షో అంత పాపులర్ కాలేదు. ప్రస్తుతం లాక్‌డౌన్ సమయంలో ఈ షోను రీ-టెలీకాస్ట్ చేస్తున్నారు. ఇందులో బ్రాహ్మణులను కించపరిచారంటూ ఇప్పుడు కేసు నమోదు చేశారు. దీనిపై శ్రీముఖి, జెమిని టీవీ యాజమాన్యం ఎలా స్పందిస్తారో చూడాలి.